![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరీయల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-1002 లో వసుధార, అనుపమ, మహేంద్ర ముగ్గురు వారింట్లో కూర్చొని మాట్లాడుకుంటారు. చివరికి వసుధార కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో సంతకం చేస్తుండగా.. సరిగ్గా అదే టైమ్ కి ఎక్కడి నుండో వచ్చాడు. ఎంత ఫాస్ట్ గా వచ్చాడో అంతే సూపర్ గా మనకి హెల్ప్ చేశాడు. ఏ తల్లి కన్నబిడ్డో కానీ మనం వారికి ఋణపడి ఉంటామని మహేంద్ర అంటాడు. యాభై కోట్లు అంటే మాటలా అని మహేంద్ర అనగా.. నేను అదే ఆలోచిస్తున్నాను మామయ్య.. ఏమీ ఆశించకుంటా ఎందుకు ఇచ్చాడా అని వసుధార అంటుంది. అంటే ఏంటమ్మ నువ్వనేది అనగానే.. ఎవరి వెనుక ఏ మర్మం ఉందో.. మనం ఇలానే చాలాసార్లు మోసపోయాం.. రీసెంట్ గా భద్ర కూడా మన దగ్గర చేరి మన విషయాలన్నీ ఆ శైలేంద్రకి చేరవేశాడని వసుధార అంటుంది.
ఇప్పటివరకు మనకు ఎదురైనవాళ్ళలో దుర్మార్గులే ఉన్నారు. కానీ సమాజంలో చెడ్డవాళ్ళు ఎలాగో మంచివాళ్ళు అలాగే ఉన్నారు కదా.. అందరిలా ఇతను కూడా అలా చేస్తాడనుకోకూడదు కదా అని వసుధారతో మహేంద్ర అంటాడు. మనకి హెల్ప్ చేసిన వాళ్ళంతా అలాగే లేరు కానీ అయినవాళ్ళకే డబ్బు ఇవ్వడానికి వెనక ముందు ఆలోచిస్తున్నారు కానీ అన్ని కోట్లు ఎలా ఇచ్చాడు.. ఏదో ఉందని వసుధార అనగా.. నిజంగా అతను ఫ్రాడ్ చేయాలనుకుంటే మన కాలేజీలో షేర్ అడిగేవాడు లేదా ఏదైన పొజిషన్ అడిగేవాడని మహేంద్ర అనగా.. అలా అడిగితే డౌట్ వస్తుందని అడగలేదేమో అని వసుధార అంటుంది. ఇక అలా ఇద్దరు మాట్లాడుకున్నాక.. మను గురించి మీరేం మాట్లాడట్లేదు సైలెంట్ గా ఉన్నారు ఏమైనా ప్రాబ్లామా అని అనుపమని వసుధార అడుగుతుంది. అదేం లేదు.. నేనెలా నిర్ణయం తీసుకుంటాను మీరు డిసైడ్ అవ్వండి అని అనుపమ అనగానే.. అలా లైట్ తీస్కోకండి మేడమ్, భద్ర విషయంలో అదే తప్పు చేశామని వసుధార అంటుంది. ముందు ముందు మను గురించి నిజం తెలుసుకోవాలనుకుంటారు. కానీ మను గురించి ఏం తెలియకూడదని అనుపమ అనుకుంటుంది. ఆ తర్వాత మను దగ్గర పనిచేసే స్టాఫ్ మనం చెక్ ఇచ్చేవాళ్ళు ఫేక్ సర్ అని మనుకి రాజు డీటేల్స్ చూపిస్తాడు. ఎంక్వైరీ చేసి చెప్దామని ఆగానని రాజు అంటాడు. మరోవైపు శైలేంద్ర కాలేజీ ఎండీ సీటు రాలేదని ఏడుస్తూ ఉంటాడు.
అప్పుడే తన దగ్గరికి దేవయాని వచ్చి ఓదారుస్తుంది. నాకు ఆ ఎండీ సీట్ రాసిపెట్టి లేదేమో, నా జాతకంలో శని ఉందేమో అని దేవయానితో శైలేంద్ర అంటాడు. శని నీ జాతకంలో లేదు మీ భార్య నోట్లో ఇందని దేవయాని అంటుంది. ఇక ధరణి వచ్చి కాఫీ తీసుకొని రావాలా అని అడుగుతుంది. ఇంతకముందు వద్దని అనుకున్నారు కానీ ఇప్పుడు కావాలేమో అని ధరణి అనగా.. వద్దని శైలేంద్ర అంటాడు. కాసేపటికి ధరణి వెళ్ళిపోతుంది. మరోవైపు మనుకి వసుధార కాల్ చేసి.. ఈరోజు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. టైమ్ అండ్ లోకేషన్ చెప్తానని వసుధార కాల్ కట్ చేస్తుంది. చెక్ తీసుకున్న వాళ్ళు శైలేంద్రతో మాట్లాడుతుంటారు. అప్పుడే అక్కడికి మను వచ్చి నేను సెట్ చేయనా.. ఇలా మనీ మ్యాటర్స్ లో కరెక్ట్ గా సెట్ చేస్తా అని మను అనగానే శైలేంద్ర, వాళ్ళు చూసి షాక్ అవుతారు. ఏంటి సెట్ చేసేది మేమేదో కాజువల్ గా మాట్లాడుకుంటున్నామని శైలేంద్ర అంటాడు. కాలేజీనీ లాక్కుందామనుకునేవారితో కాజువల్ గా మాట్లాడటమేంటని మను అడుగుతాడు. వీళ్ళ వెనక ఉంది నువ్వే అని తెలుసుకున్నానని మను అంటాడు. నాకు వీళ్ళకి సంబంధం లేదని మనుతో శైలేంద్ర అంటాడు. మను అసిస్టెంట్ రాజు అంతా వెరిఫై చేశానని డీబీఎస్టీ కాలేజీ మీద ఎటువంటి అప్పు లేదని, మీరు అప్పు తీసుకునే స్టేజ్ లో తప్ప ఇచ్చే స్టేజ్ లో లేరని తెలిసిందని అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |